కార్యకర్త పాడెమోసిన జడ్పీ చైర్మన్

ఆయనో జడ్పీ చైర్మన్. టీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి నాయకుడు మంగళవారం కన్నుమూశాడు. ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న చైర్మన్ కార్యకర్త పాడె మోసి పార్టీ కార్యకర్తలపై తనకున్న అభిమానాన్ని చాటాడు.

ఖమ్మం జిల్లా మధిర మండలం ఆత్కూరు గ్రామంలో టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు అబ్బూరి రామకృష్ణ అంతిమయాత్రలో గులాబీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యాత్రలో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్బూరి రామకృష్ణ పాడెను కమల్ రాజు మోశారు.

అంతిమయాత్రలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు మల్లాది వాసుతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.