ఆ40 మంది ఎవరు?

• టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల్లో టెన్షన్

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్ తో జరిపిన చర్చలపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఎవరికి తోచినట్లు వారు పలు రకాలుగా భాష్యాలు చెప్తున్నారు. టీఆరఎస్- కాంగ్రెస్ పార్టీ వైఖరులు ఎలా ఉన్నా ఆ 40 మంది ఎవరన్న విషయంపై ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు నెలకొంది.

ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ టీం గతంలో రాష్ట్రంలో రెండు విడతలు జరిపిన సర్వేల నివేదికను సీఎం కేసీఆర్ కు పీకే అందజేసినట్లు చెప్తున్నారు. ఆయా సర్వేల్లో 40 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేల్చి చెప్పారని సమాచారం. గతంలోనే వారి వివరాలు అందజేసిన పీకే తాజాగా నిర్వహించిన మూడో సర్వేలోనూ అదే వెల్లడైందని తేల్చి చెప్పారట.

ఆ40 మంది నియోజకవర్గాల్లో పనితీరు మెరగవ్వాలని గతంలోనే అధినేత నుంచి సీరియస్ ఆదేశాలు వెళ్లాయని తెలిసింది. ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవల్ కు వెళ్లాలని, అందరినీ కలుపుకోవాలని, పనితీరు మెరుగు పర్చుకోవాలని సూచనలు ఇచ్చినట్లు సమాచారం.

అయితే తాజా సర్వేలోనూ ఎలాంటి మార్పు కానరాక పోవడంతో ఖశ్చితంగా కొందరిని మార్చాలంటూ పీకే సీఎం కేసీఆర్ కు నివేదిక ఇచ్చారని జోరుగా చర్చ జరుగుతోంది. వీరిలో కొందరు మంత్రులు కూడా ఉన్నట్లు గుసగుసలు. దీంతో పోస్టు ఉంటుందా.. ఊడుతుందా.. అన్న ఆందోళన పలువురు ఎమ్మెల్యేల్లో గూడుకట్టుకొని ఉంది.

ప్రతి జిల్లాలో ఆ40 మందిలో ఎవరి పేరుంది.. అంటూ జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఒకవైళ క్యాండిడేట్ ను మార్చాల్సి వస్తే ఆయా స్థానాల్లో పార్టీలో ఎవరు అర్హులో అన్న విషయంపైనా పీకే టీం సీఎంకు ఇచ్చిన సర్వే నివేదికలో పొందుపర్చినట్లు తెలిసింది.