ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం

బింగ్ బ్రేకింగ్ న్యూస్..

ప్రఖ్యాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందరి ఊహకు అందని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పెద్దలతో వరుస సమావేశాలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ వచ్చిన ఆయన సీఎం కేసీఆర్ తో మంతనాలు జరపడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కాంగ్రెస్ పెద్దలతో సమావేశమైన సందర్భంగా ఆ పార్టీకి ప్రశాంత్ కిషోర్ పలు సలహాలు, సూచనలు అందజేశారు. పార్టీకి పటిష్ఠ నాయకత్వం, సమన్వయం అవసరమని ఆయన సూచనలు చేశారు. ఈ సందర్భంగానే ప్రశాంత్ కిషోర్ ను ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఆ తర్వాత హైదరాబాద వచ్చిన ప్రశాంత్ కిషోర్ గత శని, ఆదివారాల్లో సీఎం కేసీఆర్ తో సమాలోచనలు చేశారు. అయితే ఢిల్లీ వెళ్లాక కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలకం అవుతారని అందరూ భావించారు. కానీ అందరి ఊహకు అందని విధంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై తాను విముఖత చూపుతున్నట్లు ఆ పార్టీ అధిష్ఠానానికి ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు అయింది.

తమ పార్టీలో చేరిక విషయంపై ప్రశాంత్ కిషోర్ నిర్ణయాన్ని గౌరవిస్తాం.. తమ పార్టీకి ఆయన సలహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.. అని ఏఐసీసీ నేత రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా పేర్కొన్నారు.