తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా జరిగిన మహిళ సంక్షేమ దినోత్సవం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా జరిగిన మహిళ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఏఎంసి సెక్రటరీ, సిబ్బందిని సత్కరించిన ఏఎంసీ చైర్మన్ పాపారావు.

శంకర్ పల్లి; తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ సెక్రెటరీని, సిబ్బందిని మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు వారిని శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు.

ముఖ్యంగా మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబార క్ వంటి పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆదుకుంటున్నారని తెలిపారు. అలాగే రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి వారి సంక్షేమంపై పాటుపడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎస్. సంతోష్, ప్రశాంత్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.