బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి.

బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి.

శంకర్ పల్లి; బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శంకర్ పల్లి మండలంలోని మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మోకిలా పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజేంద్ర నగర్కు చెందిన మహమ్మద్ చాంద్ పాషా(32) ఈనెల 12వ తేదీన తన బైక్ పై శంకర్ పల్లికి పని నిమిత్తమై వచ్చి తిరిగి రాజేంద్రనగర్ సులేమాన్ నగర్ వాసి తిరిగి వెళుతుండగా అదే రోజు రాత్రి 11:50 గంటల సమయంలో మోకిలా సమీపం లోని న్యూ అశోక్ కదిరి గ్రీన్ వెంచర్ వద్ద మోటార్ బైక్ అదుపుతప్పడంతో కిందపడి తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.