Amanagal News.. Mysigandi temple.. విన్నర్ అభిషేక్ జట్టు.. రన్నరప్ ఉమేశ్ టీం..

  • మైసిగండిలో ముగిసిన వాలీబాల్ పోటీలు
  • క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేయాలి : టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్

రచ్చబండ, ఆమనగల్లు(కడ్తాల్): క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ కోరారు. విద్యతో పాటు ఆటల పోటీలు ఇతర పోటీలలోను విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి ప్రభుత్వం చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు. వారికి కావాల్సిన గ్రామీణ స్థాయిలో ఆట స్థలాలు కేటాయించాలని, విద్యార్థులు, యువకులు సైతం అన్నింట్లో ప్రప్రథమంగా ఉండాలని అన్నారు.

గత నెల రోజుల నుంచి మైసిగండిలో జరుగుతున్న వాలీబాల్ ఫైనల్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక సర్పంచ్ తులసీరామ్ నాయక్ తో కలిసి టాస్ వేసి ఫైనల్ మ్యాచ్ ప్రారంభించారు. ఈ మ్యాచ్ లో గెలుపొందిన యువకులకు, ప్రైజ్ మనీతో పాటు, మెమోంటోలు, విద్యార్థులకు అందచేసారు.

ప్రథమ బహుమతి అభిషేక్ టీం గెలుపొందగా వారికి 15,000 ప్రైజ్,  ద్వితీయ బహుమతి ఉమేశ్ టీం గెలుపొందగా వారికి 11,000 వేల ప్రైజ్ మనీని తులసిరామ్ నాయక్ తో స్థానిక నాయకులతో కలిసి శ్రీనివాస్ గౌడ్ అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ధన్ రాజ్, ఉప  సర్పంచ్, రాజా రామ్ నాయక్, రామ్ దాస్ నాయక్, రెడ్యానాయక్, హీరాసింగ్ నాయక్, భోని శంకర్, స్టాలిన్ కిషన్, లాలా, గోపాల్, శ్రీను, ప్లేయర్స్ పాల్గొన్నారు.