Shankerpally News.. ఏపీ టు మహారాష్ట్ర గంజాయి సప్లయ్ వయా శంకర్ పల్లి

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పోలీసులు గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున గంజాయి ప్యాకెట్లు తరలిస్తున్న వాహనాన్ని అడ్డగించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి నుండి శంకర్ పల్లి మీదుగా బొలెరో వాహనంలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు సైదాఖాన్, మహమ్మద్ ఆదిల్ గురువారం శంకర్ పల్లి వీడియోల చౌరస్తా మీదుగా శంకర్ పల్లి పోలీసులు ఉదయం 10 గంటల ప్రాంతంలో వాహనాన్ని తనిఖీ చేశారు.

వారివద్ద రెండు కేజీల బరువు గల 114 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అలాగే వారి వద్ద ఉన్న మూడు సెల్ ఫోన్ లు కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డిసిపి తెలిపారు. ఈ సమావేశంలో శంకర్ పల్లి సీఐ ప్రసన్న కుమార్, ఎస్సై సంతోశ్ రెడ్డి, ఎస్ ఓ టి పోలీసులు ఉన్నారు.