కెసిఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది…….
శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి.
నిఘా. శంకర్ పల్లి: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని శంకర్ పల్లి మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎంపీపీ మండలంలోని మోకిలా రైతు వేదిక వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆదుకుంటున్నారని తెలిపారు.
మూడు సంవత్సరాలలో కాలేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు లేకున్నా, వాటిని అమలు చేసి తెలంగాణ ఆడపడుచులకు వారి పెళ్లిళ్లకు రూ. లక్ష 116 లు అందిస్తున్నారని తెలిపారు. వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, గీతా పారిశ్రామిక కార్మికులకు, బోదకాలు వ్యాధిగ్రస్తులకు, బీడీ కార్మికులకు, దివ్యాంగులకు పింఛన్లు అందిస్తూ వారి బ్రతుకుల్లో వెలుగులు నింపారని సీఎం కేసీఆర్ ను కొనియాడారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలలో కంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. అత్యధిక అసెంబ్లీ భవనాన్ని నిర్మించారని, అలాగే 100 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీ ప్రక్కన ఆవిష్కరించాలని చెప్పారు. కాగా ప్రతి గ్రామంలో సర్పంచులు తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా జాతీయ జెండాలను ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మొయినుద్దీన్, ఎంపీడీవో వెంకయ్య, మోకిలా సర్పంచ్ సుమిత్ర మోహన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ గ్రామ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్, శంకర్ పల్లి ఏఎంసి వైస్ చైర్మన్ కుర్మా వెంకటేష్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, ఏఎంసి డైరెక్టర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.