శుభోదయం చేవెళ్ల

*శుభోదయం కార్యక్రమంలో పల్లె పల్లెకు BRS పార్టీ
గడప గడపకు MLA కాలే యాదయ్య గారు*

గ్రామీణ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం
అధికారులు, ప్రజా ప్రతినిధుల సమిష్టి కృషి ఫలితం గ్రామాల అభివృద్ధి :ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు


ఈరోజు ఉదయం శంకర్ పల్లి మండలం,లక్ష్మ రెడ్డి గూడ, గాజుల గూడ,గ్రామంలో శుభోదయం కార్యక్రమంలో లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసారు, గౌరవ శాసనసభ్యులు చేవెళ్ల MLA:కాలే యాదయ్య గారు…

అనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…

గ్రామీణ అభివృద్ధి లక్ష్యమే ముఖ్యమంత్రి ధ్యేయం

గ్రామీణ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, మన రాష్ట్రంలోని గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమం క్రింద అభివృద్ధి జరిగి తెలంగాణ కు జాతీయ అవార్డులు వస్తున్నాయన్నారు

పూర్తిస్థాయిలో గ్రామాలలో సిసి రోడ్స్ నిర్మాణం కొత్త గ్రామపంచాయతీలకు గ్రామపంచాయతీ భవనాలు,వైకుంఠధామాలు,రైతు వేదికలు,డ్రైనేజి నిర్మాణలు,మిషన్ భగీరథ వాటర్,ఇంటింటికి నల్లనీళ్లు అన్ని సంక్షేమ పథకాలు,ద్వారా గ్రామీణ అభివృద్ధి పెద్ద స్థాయిలో జరిగిందన్నారు..

గ్రామీణ ప్రాంతాల అభివృద్దే ధ్యేయంగా సీఎం కేసీఆర్ వల్ల రాష్ట్రంలోని పల్లెల స్వరూపం పూర్తిగా మారిపోయిందని తెలిపారు.

పల్లె ప్రగతి కార్యక్రమం క్రింద గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు అందించా యని, ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ నిర్మాణం, ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ, కంపోస్ట్ షెడ్డు, నర్సరీ, వైకుంఠధామ నిర్మాణం వంటి వసతులు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని MLA గారు తెలిపారు.

దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వంద శాతం గ్రామాలు ఓడిఎఫ్+ గా ప్రకటించబడ్డాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు, ప్రజా ప్రతినిధులు వారు ఉన్న సమయంలో వారి మార్క్ ఆ ప్రాంతంపై పడే విధంగా చిత్తశుద్ధితో పని చేయాలని MLA గారు సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుల రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలు రాష్ట్రంలోనే టాప్ లో ఉంటున్నాయని, దీనికి ప్రధాన కారణం ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో, చిత్తశుద్ధితో పనిచేయడమని, ఇదే స్ఫూర్తి కొనసాగించా లని MLA గారు సూచించారు..

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పిటిసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్. ఉపాధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, శంకర్పల్లి ఏఎంసి చైర్మన్ మారేపల్లి పాపారావు, సర్పంచులు ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ రెడ్డి, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.