తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు మండల కేంద్రంలోని కోర్ట్ ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జ్ స్వరూప ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జ్ స్వరూప, సబ్ ఇన్స్పెక్టర్ సుందరయ్య, బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగఫలితం సుదీర్ఘ పోరాటం వల్లనే మనకు తెలంగాణ వచ్చింది అన్నారు.

అలాగే ఆమనగల్లు కోర్టు ఏర్పాటు అయి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టి వార్షికోత్సవం జరుపుకున్నారు. సకల జనులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి స్వరూప, సూపరిడేంట్ లక్ష్మీ నరసింహారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ సుందరయ్య, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు యాదిలాల్, మల్లేపల్లి జగన్, ప్రధాన కార్యదర్శి దుడ్డు ఆంజనేయులు, అడ్వకేట్లు రామకృష్ణ, ఏర్రవోలు శేఖర్, మధు, వస్పుల మల్లేష్, గణేష్, భిచ్యానాయక్ కోర్టు సిబ్బంది పాల్గొనడం జరిగింది.