ఏరువాక పౌర్ణమిన గోవులకు పూజలు

రచ్చబండ, శంకర్ పల్లి; ఏరువాక పూర్ణిమ సందర్భంగా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని అంతప్పగూడ గ్రామంలో గల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున బ్రహ్మానంద ఆశ్రమంలో ఉన్న గోవులకు ఆశ్రమ వాసులు పూజలు నిర్వహించారు. శంకర్ పల్లి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా రైతు లక్ష్మి కి సన్మానం చేశారు.

ఈ సందర్భంగా సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కొరకు పాటుపడాలని కోరారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించి రైతులకు మేలు చేయాలన్నారు. రాత్రి పగలు కష్టపడి పనిచేసే అన్నదాతలకు మనమందరం అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సేవ ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ వి. వీరేంద్ర చారి, సభ్యులు భాస్కర్ రెడ్డి, శేఖర్ చారి, తదితరులు పాల్గొన్నారు.