శాంతిభద్రతలు ఉన్నచోట అభివృద్ధి వేగంగా ఉంటుంది
* శంకర్ పల్లి సీఐ ప్రసన్నకుమార్
రచ్చబండ, శంకర్ పల్లి; శాంతి భద్రత ఉన్నచోట అభివృద్ధి వేగవంతంగా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సీఐ ప్రసన్నకుమార్ అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా పోలీస్ సురక్ష దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శంకర్ పల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పోలీస్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు జరిగాయన్నారు.
పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతినెల ఖర్చులతో పాటు ప్రభుత్వం సరిపడా వాహనాలను సమకూర్చందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, క్రైమ్ రేట్లు తగ్గుతున్నాయని చెప్పారు. ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు కృష్ణ, సంతోష్ రెడ్డి, హెడ్ హెడ్ కానిస్టేబు లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.