రైతుబంధు, రైతు బీమా పథకాల్లో చేరేందుకు మీరు అర్హులేనా?

రైతుబంధు, రైతు బీమాకు మీరు అర్హులేనా?

రచ్చబండ, శంకర్ పల్లి; వర్షాకాలం 2023-24 కాలానికి రైతులు పంట పెట్టుబడి సహాయం కొరకు కొత్తగా పట్టా దారు పాసుబుక్కు కలిగిన రైతులు, గతంలో నమోదు చేసుకొని రైతులు సహాయం కొరకు దరఖాస్తు చేసుకోవాలని శంకర్ పల్లి మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు తెలిపారు.

ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతు బీమాకై రైతుల నుండి ఈనెల 15వ తేదీ నుండి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ దరఖాస్తులు మండలంలోని మహాలింగాపురం, పరివేద, ఎలువర్తి, మోకిలా రైతు వేదికల వద్ద తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్విజయం చేసుకోవాలని ఆయన కోరారు.