శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలి

శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలి
* చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
* మోకిలలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం

రచ్చబండ, శంకర్ పల్లి; శాంతి భద్రత పరిరక్షణ కోసం ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం శాసనసభ్యులు కాలే యాదయ్య అన్నారు. సోమవారం శంకర్ పల్లి మండలంలో మోకిల నూతన పోలీస్ స్టేషన్ ను రాజేందర్ నగర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ కలిగించిందని చెప్పారు.

రాజకీయ జోక్యాన్ని తగ్గించిందని తెలిపారు. పోలీస్ శాఖ అమలు చేస్తున్న నూతన విధానాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా గత తొమ్మిది సంవత్సరాలలో క్రైమ్ రేట్ తగ్గిపోయిందని తెలిపారు. దేశంలోనే సురక్షితమైన మహానగరంగా హైదరాబాద్ నిలిచింది అన్నారు. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నారని ప్రశంసించారు. శంకర్ పల్లి మండలంలో రెండో పోలీస్ స్టేషన్ మోకిలలో ప్రారంభించడం సంతోషకరంగా ఉందని తెలిపారు.

ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవాడ, మిర్జాగూడ, సేరిగూడ, కొండకల్, మోకిలా, మోకిలా తాండ, కాకర్లగుట్ట తాండ, పిల్లిగుండ్ల, దొంతంపల్లి, మహారాజ్ పేట్, గోపులారం గ్రామపంచాయతీ మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, అసిస్టెంట్ కమిషనర్ రమణ గౌడ్, నార్సింగ్ సీఐ వి. శివకుమార్, ఎస్ హెచ్ ఓ నర్సింగ్, సంజయ్ కుమార్, శంకర్ పల్లి ఎస్సై కృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా మోకిలా సిఐ నరేష్ ను ఎమ్మెల్యే కాలే యాదయ్య శాలువతో సత్కరించారు.