బయ్యన్నగూడలో రేషన్ షాప్ ఏర్పాటు చేయండి

బయ్యన్నగూడలో రేషన్ షాప్ ఏర్పాటు చేయండి
* శంకర్ పల్లి పిఎసిఎస్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి

రచ్చబండ, శంకర్ పల్లి; శంకర్ పల్లి మండలం మహాలింగాపురం గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన బయన్నగుడలో రేషన్ షాపును ఏర్పాటు చేయాలని మహాలింగాపురం గ్రామ నివాసి, శంకర్ పల్లి పిఎసిఎస్ డైరెక్టర్ కాడి గారి రాజశేఖర్ రెడ్డి అధికారులను డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బయన్నగూడ గ్రామం మహలింగపురం గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. బయన్న గూడ గ్రామంలో రేషన్ షాపు లేనందున మహాలింగాపురం గ్రామంలో గల రేషన్ షాప్ కు వచ్చి బియ్యం తదితర వస్తువులు తీసుకెళ్లాల్సి వస్తుందని తెలిపారు.

బయన్న గూడా నుండి రేషన్ కొరకు ముసలి వాళ్లు, మహిళలు మహాలింగాపురం రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బయన్న కూడా గ్రామంలో రేషన్ షాపును ఏర్పాటు చేసి ఆ గ్రామస్తుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. బయన్న గూడా గ్రామంలో సుమారు 70 వరకు రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు.

వృద్ధులు వేలిముద్రలు సరిగా రాకపోవడంతో వారు బియ్యాన్ని వదులుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లకు అధికారులు కలిగించాలని కోరారు. బయన్న గూడ గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపిన ఫలితం లేకుండా పోతున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్ పల్లి తహసిల్దార్ ఈ విషయంలో చొరవ తీసుకొని బయన్న గూడా గ్రామంలో మరో రేషన్ షాపును ఏర్పాటు చేయాలని కోరారు.