పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలి

పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలి
* శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్

రచ్చబండ, శంకర్ పల్లి; పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని శంకర్ పల్లి మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శంకర్ పల్లి లో సోమవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటాలన్నారు. ఇష్టం వచ్చినట్లు చెట్లు నరకడం వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందని తెలిపారు. పచ్చని చెట్లు గ్రామాలలో ఉంటేనే వర్షం కురుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.