బాధితులకు 4 లక్షల ప్రమాద బీమా

రచ్చబండ, ఆమనగల్లు(కడ్తాల్): రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని మక్త మధారం గ్రామానికి చెందిన సురేష్ కడ్తాల్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా కింద రూ.436, ప్రధానమంత్రి సురక్ష యోజన 20 ల ఇన్సూరెన్స్ చేసుకున్నాడు.

ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందాడంతో ఎపిజివిబి రీజినల్ మేనేజర్ భీంసేవ్ రావ్, బాధిత కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు ఎఫ్ఐసి నోడల్ ఆఫీసర్ రమేష్, ఎస్బి ఐ బిడియం నరేష్, కడ్తాల్ మేనేజర్ రాజ్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ నజ్రిన్,సిబ్బంది ఆంజనేయులు,అరుణ్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.