రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : ఉన్న ఆస్తులు కరగదీసి ఉంచుకున్నోళ్ల (ప్రియురాళ్ల)కు ఇచ్చారని మన పెద్దలు వెనుకటి ఎన్నో ఆనవాళ్లు చెప్తుంటారు. ఎందరో భూములు అమ్ముకున్నారు.. ఇల్లు రాసిచ్చారు.. ధనం కరగదీశారు.. ఆఖరుకు ఎందరో అనామకులుగా మిగిలారు. ఈ కాలంలోనూ అలాంటి అరుదైన వారు ఇంకా ఉన్నారనడానికి ఇతడే ఓ నిదర్శనం.
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో శేఖర్(40), ఆయన భార్య, తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇటీవల భార్యాభర్తలకు విబేధాలు పొడచూపాయి. దీంతో శేఖర్ భార్య వేరుగా ఉంటోంది.
ఆమెకు తన తల్లిగారు ఇచ్చిన బంగారు ఆభరణాలు అత్తగారింటిలో ఉన్నాయి. వాటిని తీసుకెళ్లేందుకు వెళ్లగా అక్కడ ఆ ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆమె అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల విచారణలో ఆశ్యర్యకరమైన విషయం వెల్లడైంది. శేఖర్ తన భార్యకు చెందిన 300 సవర్ల బంగారం, తన తల్లికి చెందిన మరో 200 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించి తీసుకెళ్లాడు.
వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో తన ప్రియురాలికి ఓ కారును గిఫ్ట్ గా ఇచ్చాడని తేలింది. ప్రియురాలి కోసం ఏమివ్వాలో తెలియక బంగారాన్నే చోరీ చేసి అమ్మిచ్చాడు. ఇలా ఉంది వ్యవహారం.. ఇలాంటి వారు మనలో ఇంకెందరో ఉన్నారు కదూ..