భార్య నగ్న వీడియో, ఫొటోలను స్నేహితుడికి పంపాడు!

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : మహిళల పట్ల వేధింపులు ఈనాటివి కాదు. చారిత్రక కాలం నుంచే వేధింపులు ఉండేవని మనం పురాణాల్లోనూ విన్నాం. బయటి వారి నుంచే కాకుండా భర్తల నుంచి కూడా మహిళలకు పలు రకాల వేధింపులు నిత్యకృత్యమయ్యాయని మనం వింటూనే ఉంటాం. ఇక్కడా ఇలాంటిదే ఒకటి జరిగింది. సభ్యసమాజానికి తలవంపు తెచ్చేలా ఉన్న ఈ ఘటన మన హైదరాబాద్ సమీపంలోనే జరిగింది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కు చెందిన ఓ వ్యక్తి (35) ఆరేళ్ల క్రితం 27 ఏళ్ల వయసున్న మహిళను వివాహం చేసుకున్నాడు. అతడు వ్యాపారి కావడంతో కట్నం కూడా బాగానే సమర్పించుకున్నారు. రూ.5లక్షల నగదు, 9తులాల బంగారం, లక్షలాది రూపాయల విలువైన గృహోపకరణాలు కట్నంగా తీసుకున్నాడు ఆ ఘనుడు.

ఈ క్రమంలో అదనపు కట్నం కోసం నిత్యం వేధించసాగాడు. ఆమె తన వ్యథను దిగమింగుకుంటూ సంసారం చేసుకుంటూ ఉండేది. ఎంతో వేధింపులకు గురి చేసేవాడని తెలిసింది. ఆమె ఎంతకూ వినక పోవడంతో అతడిలోని వికృత రూపం బయటకొచ్చింది.

పడక గదిలో భార్యాభర్తలు ఉండగా ఆమెకు తెలియకుండా నగ్న వీడియోలు, ఫొటోలు తీశాడు. వాటిని తన ఫ్రెండ్ కు పంపాడు. అదే ఫ్రెండ్ తో గడపాలంటూ తన భార్యపై ఒత్తిడి కూడా చేయసాగాడు. ఇక వేధన భరించలేని ఆ మహిళ ఆదివారం పోలీసులను ఆశ్రయించింది.

కొందరు మగాళ్లు మృగాళ్లుగా మారి ఎందరో మహిళలను ఇలా చిత్రవధ చేస్తున్నారు. ఇవన్నీ పంటిబిగువున భరిస్తూ ఎందరో కాలం వెళ్లదీస్తున్నారు. ధైర్యం చేసిన కొందరు ఆ కూపం నుంచి బయటపడి స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఇలాంటి వికృత చర్యలకు ఫుల్ స్టాప్ పడేదెప్పుడో మరి.