రామంతపురంలో విద్యుత్ లో వోల్టేజీ
* రెండేండ్లుగా ఇదే సమస్య
* ఇబ్బందులు పడుతున్న ప్రజలు
* పట్టించుకోని విద్యుత్ అధికారులు
* కౌన్సిలర్ చాకలి అశోక్
రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఏడో వార్డు పరిధిలోని రామంతపురంలో గత రెండు సంవత్సరాలుగా లో వోల్టేజ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ వార్డు కౌన్సిలర్ సాకలి అశోక్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ సమస్యపై విద్యుత్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య విద్యుత్ ఏడీకి వివరించమని చెప్పినా ఫలితం లేకుండా పోతున్నదని వాపోయారు. రామంతపురంలో లో వోల్టేజీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఫ్యాన్లు, లైట్లు సరిగా వెలాగడం లేదని తెలిపారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు రామంతపురంలో లో వోల్టేజ్ సమస్యను తీర్చాలని ఆయన కోరారు.