- ఆమనగల్లు వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి
- యాదవులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
రచ్చబండ, ఆమనగల్లు : రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం త్వరలో చేపట్టనున్న సందర్బంగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోని మంగళపల్లి గ్రామ పంచాయితీ లో నిర్వహించిన అవగాహన సదస్సు నిర్వహించారు. మంగళపల్లిలో 56 కొత్త వాళ్ళు, ఇంతకూ ముందు తీస్కొని 8 మంది పాత వాళ్లు మొత్తం 64 మంది లబ్దిదారులు ఉన్నారు.
75% సబ్సిడీతో ఈ గొర్రెల పంపకం ఉంటుంది. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆమనగల్లు మండలం వైస్ ఎంపీపీ జక్కు అనంత రెడ్డి, మంగళపల్లి సర్పంచ్ నర్సింహారెడ్డి, యాదవ సంఘం అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, డాక్టర్ విజయ్ కుమార్, బిఅర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వెంకటేశ్ పాల్గొని యాదవులకు అవగాహన కల్పించారు.
లబ్ధిదారులు కులం సర్టిఫికెట్, చనిపోయిన వారు ఉంటే కుటుంబ వివరాలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పెద్దలు, లబ్ధిదారులు కేసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేసించి చివరగా జక్కు అనంత రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల పాలిట దేవుడు, ఆయన తెలంగాణలో ప్రవేశ పెట్టిన పతకాలకి ఆకర్షితులై పక్కా రాష్ట్రం వాళ్లు మమ్మల్ని తెలంగాణలో కల్పండి అంటున్నారు అని అన్నారు.