- యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్
- ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వ్యాఖ్యలకు ఖండన
రచ్చబండ, ఆమనగల్లు: కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్ అన్నారు. ఇటీవల కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు సరి కాదని యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖతం అయిందని, వారు పోటీయే కాదని, బీఆర్ఎస్ పార్టీకి కల్వకుర్తిలో ఎవరూ పోటీ కాదని అనడం హాస్యాస్పదం అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలమెంతో రాబోయే ఎన్నికల్లో చూస్తారని కల్వకుర్తి కాంగ్రెస్ కంచుకోటపై ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగురుడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లొనే ఆ పార్టీ నాయకులు ఆత్మీయ సమేళనాళతో పక్క దారి చూస్కుంటున్నారని, ముందు వాటిని సరి చేసి పక్క పార్టీల గురించి మాట్లాడితే బాగుంటుందని అన్నారు. మొన్న కడ్తాల్ నుంచి ఆమనగల్లు వరకు జరిగిన కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ ఒక రోజు ముందు ఇచ్చిన పిలుపుతోనే వందలాది బైకులతో యువజన కాంగ్రెస్ మిత్రులు పాల్గొన్నారని, పార్టీ ఉందా లేదా అనడానికి ఇదే ఒక నిదర్శనమని చెప్పారు.
ఎమ్మెల్యే రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న కల్వకుర్తి నియోజకవర్గానికి ఏమి నిధులు , అభివృది పనులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పక్క నియోజకవర్గంలో అభివృద్ధి మన అభివృద్ధిపై బహిరంగంగా చర్చకు రావాలని, పక్క నియోజకవర్గ లో మినీ ట్యాంక్ బండ్ లు పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కానీ మన ఆమనగల్లు, కల్వకుర్తిలో కానీ అటువంటివి ఎక్కడ కనిపించవని తెలిపారు.
ఎమ్మెల్యే సొంత గ్రామంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు దిక్కులేదని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఒకటి గూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుత దుస్థితి చూస్తే మీ పాలన ఏ విధంగా ఉందో తెలుస్తుంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సైనికులు పార్టీ కోసం పోరాడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పేపర్ లీకేజీ చేసి నిరుద్యోగుల జీవితాలతో చేలాగటం ఆడిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆరోపించారు.
బిఆర్ఎస్ ప్లీనరీలో సర్పంచులు సమస్యలపై ప్రశ్నిస్తుంటే వద్దని ఆడ్డుకున్నారని, ఎమ్మెల్యే మీ స్వంత పార్టీ సర్పంచులకే మీపై భరోసా లేదని, మీ సమస్యలను వదిలి కాంగ్రెస్ పార్టీ ఖతమైందని అనడం సరికాదని, ఇప్పటికైనా ఎన్నికల ఏడాదిలో అయినా కల్వకుర్తి ప్రాంతానికి ఏదైనా ఒక పని చేసి ఎమ్మెల్యేగా తన కర్తవ్యాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు.
- కాంగ్రెస్ పార్టీ ఉందోలేదో ఒక నిరుద్యోగిని, కానీ రైతు రుణమాఫీ పొందిన రైతుని కానీ అడగాలని, త్వరలోనే బీఆర్ఎస్ ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున వలసలు ఉంటాయని, బిఆర్ఎస్ లీడర్లు మా అధిష్టానంతో టచ్ లో ఉన్నారని ముందు వాటిని సరిచేసుకోవాలి చెప్పారు. రానున్న రోజుల్లో ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేయడానికి ప్రణాళికలు అధిష్టానం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.