ప్రజలు తమ ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ప్రజలు తమ ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
* డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ దామోదర్

రచ్చబండ, శంకర్ పల్లి: ప్రజలు తమ ఇంట్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డిఎం హెచ్ ఓ డాక్టర్ దామోదర్ అన్నారు. మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శంకర్ పల్లి ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో మలేరియా వ్యాధి గురించి అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిష్కారాల్లో నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

నీరు నిలువ ఉంటే దోమలు, ఈగలు అధికమవుతాయని తెలిపారు. దోమల బారిన పడకుండా రాత్రివేళ నిద్రపోయే సమయంలో దోమతెరలను వాడాలని సూచించారు. గ్రామాలలో మలేరియా వ్యాధి నుండి ఎలా కాపాడుకోవాలో ఏ ఎన్ ఏం లు, ఆశ వర్కర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్ రేవతి రెడ్డి, సి హెచ్ ఓ గోపాల్ రెడ్డి, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.