చేవెళ్లకు తరలివెళ్లిన శంకర్ పల్లి బీఆర్ఎస్ శ్రేణులు

చేవెళ్లకు తరలివెళ్లిన శంకర్ పల్లి బీఆర్ఎస్ శ్రేణులు

రచ్చబండ, శంకర్ పల్లి: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలో జరిగిన సభకు శంకర్ పల్లి మండల గ్రామాల నాయకులు, మున్సిపల్ ప్రాంతాల నాయకులు మంగళవారం తరలి వెళ్లారు. అంతకుముందు గ్రామాలలో గ్రామ సర్పంచులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు జెండాను ఆవిష్కరించారు.

శంకర్ పల్లి పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో నాయకులు పార్టీ జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పిటిసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, మండల, మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కె. గోపాల్, వి. వాసుదేవ్ కన్నా, యూత్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ఉపాధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.