పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ

పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ
* శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి

రచ్చబండ, శంకర్ పల్లి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల పరిషత్ అధ్యక్షుడు ధర్మన్న గారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చందిప్ప గ్రామంలో హెచ్ఎండిఏ నిధులు 10 లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక సదుపాయాల కొరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు. ప్రతి గ్రామంలో మురికి కాలువ నిర్మాణాలు, సిసి రోడ్ల పనులు జరిగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ స్వప్నమోహన్, ఎంపీటీసీ దయాకర్ రెడ్డి, వాళ్లు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.