Home Latest News మోకిలలో మే 1 నుంచి జూన్ 1 వరకు వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం

మోకిలలో మే 1 నుంచి జూన్ 1 వరకు వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం

మోకిలలో మే 1 నుంచి జూన్ 1 వరకు వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం

రచ్చబండ. శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలా గ్రామంలోని రైతు వేదిక వద్ద గల తెలంగాణ క్రీడ ప్రాంగణంలో మే ఒకటవ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు వేసవి కాలపు వాలీబాల్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ పి. సుమిత్ర మోహన్ రెడ్డి, ఎంపీటీసీ సరిత రాజు నాయక్ తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ నెల రోజులు వరకు ప్రతిరోజు ఉదయం5:30 నుండి 8 గంటల వరకు వాలీబాల్ క్రీడలు జరుగుతాయన్నారు. ఈ వాలీబాల్ శిక్షణ శిబిరానికి శిక్షకులుగా హైదరా బాద్ లోని బండ్లగూడ కు చెందిన జాతీయ వాలీబాల్ సీనియర్ క్రీడాకారుడు శ్రీనాథ్ రెడ్డి వ్యవహరిస్తారని తెలిపారు. ఈ శిక్షణా శిబిరానికి ఇన్చార్జిగా సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు పాప గారి ఆశీర్వాదం వ్యవహరిస్తారని చెప్పారు. మండలంలోని ఆసక్తిగల యువతి, యువకులు వాలీబాల్ పాల్గొనవచ్చని వారన్నారు. ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనే వారికి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున ప్రశంసా పత్రాలతో పాటు, దాతల సహకారంతో టోర్నమెంట్లో పాల్గొనే వారికి క్రీడా దుస్తులు, ట్రోఫీ లతోపాటు నగదు బహుమతిని అందిస్తామని తెలిపారు. వివరాలకు9848416355-9948404731 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోకిలా ఉప సర్పంచ్ జి. రాజు పాల్గొన్నారు.