వాలీబాల్ విజేత మోకిలా
* కొండకల్ తండాకు ద్వితీయ బహుమతి
* ముగిసిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ వాలీబాల్-2023 టోర్నమెంట్
* బహుమతుల ప్రదానం
రచ్చబండ, శంకర్ పల్లి: ప్రస్తుత దినాల్లో యువతీ యువకులు చదువుతోపాటు ఏదో ఒక క్రీడల్లో ప్రతిరోజు ఒక గంట సేపు ఆటలు ఆడుకోవాలని దీంతో శారీరక, మానసిక ఉల్లాసానికి ఉపయుక్తంగా ఉంటాయని శంకర్ పల్లి మండల ప్రజా పరిషత్ అధికారి వెంకయ్య గౌడ్ అన్నారు. శంకర్ పల్లి మండలంలోని తెలంగాణ క్రీడ ప్రాంగణం మోకిలలో గత నెల రోజులుగా జిల్లా క్రీడా ప్రాతికారా సంస్థ రంగారెడ్డి జిల్లా (డిఎస్డిఏ), గ్రామపంచాయతీ మోకిలా, దాతలు సహకారముతో నిర్వహించబడుతున్న వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం 2023 ముగింపు సందర్భంగా నిర్వహించిన టోర్నమెంట్లో 16 జట్లు పాల్గొనగా ప్రథమ బహుమతి మోకిలా, ద్వితీయ బహుమతి కొండకల్ తాండ జట్లు విజేతగా నిలిచాయి.
బహుమతులను శంకర్ పల్లి సిఐ ప్రసన్నకుమార్ అందించారు. ప్రథమ బహుమతి పొందిన జట్టుకు 12 వేల నగదుతో పాటు షీల్డ్ అందించారు. ద్వితీయ బహుమతి సాధించిన జట్టుకు 8000 రూపాయల. నగదు షీల్డ్ అందించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ క్రీడలు ప్రతి వ్యక్తి జీవితంలో భాగస్వాములని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు పోలీస్ శాఖలో ప్రత్యేకమైన కోటాను తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. అందుకోసం యువతీ యువకులు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు.
ప్రతి సంవత్సరం గ్రామీణ యువతీ యువకులను ఒకచోట చేర్చి క్యాంపులు నిర్వహిస్తున్న సామాజిక కార్యకర్త పాపా గారి ఆశీర్వాదం అభినందించారు. అలాగే క్రీడలకు సహకరించిన దాతలకు కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శేఖర్, ముక్రం, కుమార్, విఠల్ కోచ్ రెఫ్రిలు శ్రీనాథ్ రెడ్డి, కిరణ్ కుమార్, సునీల్ క్రీడాకారులు పాల్గొన్నారు.