కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి నువ్వు ఎం చేశావో బహిరంగ చర్చకు సిద్ధమా?

కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి నువ్వు ఎం చేశావో బహిరంగ చర్చకు సిద్ధమా?
– మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి

నిఘా,ఆమనగల్లు:

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలో మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యా కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మూడు సార్లు నువ్వు ఎమ్మెల్యే అయ్యి నియోజక వర్గానికి నువ్వు చేసిన అభివృద్ధి ఏమిటో, నేను బీసీ కమిషన్ సభ్యుడిగా ఏం చేశానో చెప్తా బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆచారి ప్రశ్నించారు.

నేను పెట్టిన భిక్ష్యతో టీడీపీ,బిజెపి కూటమితో మొదటి సారి ఎమ్మెల్యే అయ్యావు అది మర్చిపోయావా? నీకు దమ్ము వుంటే కల్వకుర్తి అభివృద్ధి పై శ్వేత పత్రం విడుదల చెయ్యి, మేము తెచ్చిన సెంట్రల్ లైటింగ్ ను మేము తెచ్చాం అని చెప్పుకోవడం, ఎవరికో పుట్టిన పిల్లాడు, నాకే పుట్టాడు అన్నట్టు వుంది అని ఎద్దేవా చేశారు.నీ స్వంత గ్రామం చెల్లం పల్లిలో 8 సంవత్సరాల క్రితం మంత్రులతో శంకుస్థాపన చేసిన డబుల్ బెడ్రూం ఇండ్లు శిలా పలకానికి పరిమితం అయ్యాయి.

నీ స్వంత గ్రామంలో ఇల్లు ఇవ్వని నీవు రాజకీయ అవగాహన గురుంచి మాట్లాడడం విడ్డూరం, నువ్వు ఎమ్మెల్యే ఇప్పటి వరకు నిరుపేదలకు ఒక్క ఇల్లు అయినా నువ్వు మంజూరు చేయిస్తే నేను ఎలక్షన్ లలో పోటీ చేయను, అదే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మేము ఆమనగల్లు గ్రామంలో 1000 ఇండ్లకు ప్రతిపాదనలు పంపిస్తే 900 పై చిలుకు మంజూర్ అయ్యాయి. అభివృద్ధిపై స్థలం సమయం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చర్చకు నువ్వు రమ్మన్నా నేను సిద్ధమే నువ్వు సిద్ధమా అని సవాలు విసిరాడు.