బిజెపి ఆమనగల్లు మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు గా మాండన్ శ్రీకాంత్ సింగ్

బిజెపి ఆమనగల్లు మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు గా మాండన్ శ్రీకాంత్ సింగ్

నిఘా,ఆమనగల్లు:

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు గా మాండన్ శ్రీకాంత్ సింగ్ ని నియమించడం జరిగింది.అనంతరం జాతీయ ఓబీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి శ్రీకాంత్ సింగ్ ని శాలువాతో సత్కరించటం జరిగింది.

గతంలో శ్రీకాంత్ సింగ్ ఏబీవీపీ కెఆర్డిఆర్ కాలేజ్ ప్రెసిడెంట్ గా, ఆమనగల్ ఎబివిపి బాగ్ కన్వీనర్గా, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గా, బిజేవైఏమ్ కల్వకుర్తి తాలూకా కన్వీనర్ గా, ఆమనగల్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి గా విధులు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఆమనగల్లు బీజేపీ ఆమనగల్లు మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు గా నియమించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కండె హరిప్రసాద్, నియోజకవర్గ కన్వీనర్ యోన్నం శేఖర్ రెడ్డి, కో కన్వీనర్ గోరటి నర్సింహా, బీజేపీ నేత రాంరెడ్డి, చెన్నకేశవులు, ఏకుల శ్రీను, వడ్డే శ్రీను, పద్మ ప్రశాంత్, కడారి సాయి తదితరులు పాలుగోన్నారు.