విజయ్ మాల్యాకు జైలు, జరిమానా.. కోర్టు ధిక్కరణ పర్యవసానం

రచ్చబండ : పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. రూ.2 వేల జరిమానా కూడా విధించింది. కోర్టు ధిక్కరణను ఉల్లంఘించి బదిలీ చేసిన 40 మిలియన్ డాలర్లను తిరిగివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉదయం కోర్టు తీర్పునిచ్చింది.

2017లో కోర్టు నుంచి సమాచారాన్ని దాచిపెట్టి కోర్టు ధిక్కరణకు పాల్పడి 40 మిలియన్ డాలర్లను బదిలీ చేశాడు. అనంతరం సమాచారాన్ని దాచిపెట్టి అతడు పరారీలో ఉన్నాడు. ఈ మేరకు ఆ రూ.40 మిలియన్ డాలర్లను తిరిగివ్వాలని మాల్యా కుటుంబ సభ్యులను సుప్రీంకోర్టు ఆదేశించింది.