ఎంట్రెన్స్ పరీక్షలపై ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం

ఈనెల 13న జరిగే ఈసెట్, 14, 15 తేదీల్లో జరిగే అగ్రి, ఫార్మసీ విభాగంలో 18,19,20 తేదీల్లో జరిగే ఎంసెట్ పరీక్షలపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం వెల్లడించింది. 13న జరిగే ఈసెట్ పరీక్షను మాత్రం రద్దు చేసింది. ఎంసెట్ పరీక్షలను మాత్రం యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులపై ఎంసెట్ పరీక్షల నిర్వహణ విషయమై సోమవారం ఉన్నత విద్యామండలి కీలక సమావేశం జరిగింది. వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. విద్యుత్ సమస్యలతో అంతరాయం కలగనుంది. రోడ్లు ధ్వంసమయ్యాయి.

ఆయా కారణాలతో వాయిదా వేయాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్లు అందాయి. అయితే సమావేశంలో మాత్రం ఎంసెట్ పరీక్షలను వాయిదా వేయొద్దనే నిర్ణయానికి వచ్చినట్లు విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఈసెట్ మాత్రం వాయిదా వేసినట్లు తెలిపారు. త్వరలో దాని నిర్వహణ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.