ఆ సర్జరీలకు రూ.5 లక్షల వరకు ఉచితం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు ఆ ప్రకటన చేశారు. ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఖర్చయ్యే కొన్నిరకాల శస్త్ర చికిత్సలకు ప్రభుత్వమే ఉచితం చేస్తుందని వెల్లడించారు.

తెలంగాణలో మోకాళ్ల నొప్పులతో బాధపడేవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. ఈ తరుణంలో మోకాలు చిప్పల మార్పిడి సర్జరీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకూ హైదరాబాద్ నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకే పరిమితమైన మోకాళ్ల శస్త్ర చికిత్సలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో త్వరలో చేసేలా నిర్ణయం తీసుకుంది.

సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చయ్యే మోకాలు చిప్పల మార్పి సర్జరీలను ప్రభుత్వమే ఉచితంగా చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తామని మంత్రి ప్రకటించారు. దీంతో ఎంతో మంది పేదలకు మేలు కలిగే అవకాశం ఉంది.