టీయూడబ్ల్యూజే సూర్యాపేట జిల్లా కార్యవర్గం

• జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కోలా నాగేశ్వరరావు, బంటు కృష్ణ
రచ్చబండ, హుజూర్ నగర్: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (టీయూడబ్ల్యూజే) సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా కోలా నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బంటు కృష్ణు ఎన్నికయ్యారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాలులో ఆదివారం టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలు జరిగాయి.

ఈ సభకు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, హుజూర్ నగర్, కోదాడ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని నలుమూలల నుంచి విచ్చేసిన జర్నలిస్టులు నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ అధ్యక్షుడిగా కోల నాగేశ్వరరావు, కార్యదర్శిగా బంటు కృష్ణ, ప్రెస్ క్లబ్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా గింజల అప్పిరెడ్డిని ఎన్నుకున్నారు.

అనంతరం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోల నాగేశ్వరరావు, బంటు కృష్ణు మాట్లాడుతూ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఉద్యమాలను బలోపేతం చేయాలన్నారు.

జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు అందించాలన్నారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా తమను ఎన్నుకున్న ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రుడికి, యూనియన్ సభ్యులకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, జాతీయ కమిటీ సభ్యులు కల్లూరు సత్యనారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యులు చలసాని శ్రీనివాస్ చౌదరి, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మిక్కిలినేని శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.