కాంగ్రెస్ పార్టీ మంచి లీడర్ ను కోల్పోయింది

ఎంపీపి కొట్టె పద్మవతీ సైదేశ్వరావు
రూ.10వేల ఆర్ధికసాయం అందజేత

మేళ్లచెర్వు : మేళ్లచెర్వు మండలానికి చెందిన మంచి లీడర్ ను కాంగ్రెస్ పార్టీ కోల్పోయినదని మేళ్లచెర్వు ఎంపీపీ కొట్టె పద్మవతి సైదేశ్వరావు తెలిపారు. శనివారం మేళ్లచెర్వు కేంద్రంలో అన్నెపంగు బాబురావు సంతాప సభలో పాల్గొన్న ఎంపీపి మాట్లాడారు.

పార్టీలో తనైదైన ముద్ర వేసుకుంటూ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీకి నిరంతరం కృషి చేసే వ్యక్తి ఎంపిటిసి బాబురావు అని కొనియాడారు. బాబురావు అకాల మరణం అందరినీ కలచివేసిందని అన్నారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లా పార్లమెంట్ సభ్యులు కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా తన సానుభూతి తెలిపారని చెప్పారు.

తదనంతరం కుటుంబ సభ్యులను ఓదరుస్తూ వారికి రూ.10వేలరూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుదని భరోసా ఇచ్చారు.