పండిన ధాన్యమంతా కొనాల్సిందే..

• టీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్

వనపర్తిటౌన్ : తెలంగాణలో పండిన యాసంగి ధాన్యమంతా కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ డిమాండ్ చేశారు.

ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో సోమవారం నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని అన్నారు. రైతులతో పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు రమేష్ గౌడ్, కౌన్సిలర్ నాగన్న, నందిమల్ల భువనేశ్వరి, అలేఖ్య, మంజుల, గోపాల్ యాదవ్, ఈశ్వరమ్మ, ప్రమీల, కవిత, కోళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.