శంకర్ పల్లి మండలంలో త్రివర్ణ పతాక రెపరెపలు

శంకర్ పల్లి మండలంలో త్రివర్ణ పతాక రెపరెపలు

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలంలోని గ్రామాల్లో, మునిసిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవాన్ని ప్రజలు ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట, ప్రైవేట్ సంస్థల ఎదుట త్రివర్ణ పథకాలను ఎగురవేశారు. శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట తహసీల్దార్ సురేందర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. స్థానిక మునిసిపాలిటీ కార్యాలయం ఎదుట కమిషనర్ జ్ఞానేశ్వర్ జెండాను ఎగరవేశారు.

స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట సిఐ. వినాయక రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ పాపారావు జెండాను ఎగురవేశారు. మండలంలోని మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ ఫేస్ రెండు లో గల ఇంద్రారెడ్డి విగ్రహం ఎదుట రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు.

కార్యక్రమాల్లో శంకర్ పల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్. జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్, మిర్జాగూడ ఉప సర్పంచ్ శాంతి, మాజీ ఏఎంసి చైర్మన్ రాజు నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహ గౌడ్, శంకర్ పల్లి మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.