ప్రముఖ నటుడు విక్రమ్ కు అనారోగ్యం.. ఐసీయూలో చికిత్స

విలక్షణ నటుడు విక్రమ్ అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఒక్కసారిగా తమిళ సినీ పరిశ్రమ ఆందోళనకు గురైంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల అభిమానుల్లో కలవరం నెలకొంది.

అపరిచితుడు, శివపుత్రుడు, నాన్న చిత్రాలతో విక్రమ్ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో దక్షిణాదిలో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. తమిళనాడుతో పాటు తెలుగులో ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉంది.

విక్రమ్ శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు వెంటనే ఐసీయూలో ఉంచి వైద్య చికిత్స అందిస్తున్నారు. విక్రమ్ ను ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల విక్రమ్ కొవిడ్ కారణంగా చికిత్స పొంది కోలుకున్నారు. ‘పొన్నియిన్ సెల్వన్’ అనే సినిమా టీజర్ కార్యక్రమానికి విక్రమ్ హాజరు కానుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

విక్రమ్ కోలుకుంటున్నట్లు కావేరి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రాణాపాయం తప్పిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. సాయంత్రం కానీ, రేపు కానీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశముందని వెల్లడించారు.