ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి

  • ఆర్టీసీ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగరాజు
  • శంకర్ పల్లి ఆర్టీసీ బస్టాండ్ లో అవగాహన
  • దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు ఆదివారం స్థానిక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఏ నాగరాజు దొంగతనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రాంతాలలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమయంలోనే దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తారని తెలిపారు. అందుకోసం ప్రయాణికులు రద్దీ వేళలో ఉండాలని చెప్పారు. ఏదైనా అనుమానాస్పదంగా వస్తువు కనిపించిన, కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు కానీ 100 డయల్ చేసి సమాచారం అందించాలని ప్రయాణికులను కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.