కరాటే విద్యతో మానసిక ధైర్యం వస్తుంది

* సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్

రచ్చబండ, శంకర్ పల్లి : నేడు సమాజంలో పెరుగుతున్న అసాంఘిక కార్యరలాపాలను ఎదుర్కోవడానికి, ఆత్మరక్షణకు యువతీ యవకులు కరాటే లాంటి విద్యలను నేర్చుకోవాలని శంకర్ పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో జరిగిన జాతీయ స్థాయు 2వ కరాటే పోటీలలో బెల్టలు సాధించిన శంకర్ పల్లి ఎల్.బీ.కే. బూడూఖాన్ కరాటే అకాడమీ విధ్యార్థులను బుధవారం సేవాఫండేషన్ అభినందించడం జరిగినది.

ఈ సందర్భంగా ఫండేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ వర్ణిత్ రెడ్డి బంగారు పథకాలను, లక్ష్మీ, జనార్ధన్, హార్ధిక్ రెడ్డి రజత పథకాలను సాధించడం గర్వకారణమని అన్నారు. కరాటేతో శారీరక ధృఢత్వం లభించి, ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు సీ.జైరాంరెడ్డ, లిటిల్ స్టార్ కరెస్పాండెంట్ సంజిత్ కుమార్, టీచర్లు శ్రీనివాస్, ఆనంద్ లు పాల్గొన్నారు.