Home Latest News గోల్డ్ మెడల్ గ్రహీత, జర్నలిస్ట్ బంటు కృష్ణకు అభినందనల వెల్లువ 

గోల్డ్ మెడల్ గ్రహీత, జర్నలిస్ట్ బంటు కృష్ణకు అభినందనల వెల్లువ 

* కృష్ణ స్నేహితుల కుటుంబ సభ్యలతో కలిసి మహిళా దినోత్సవ, బర్త్ డే వేడుకలు

రచ్చబండ, సూర్యాపేట: ఇటీవల జర్నలిజం లో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ డిగ్రీతో పాటు గోల్డ్ మెడల్ సాధించిన సూర్యాపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత డాక్టర్ బంటు కృష్ణకు వివిధ వర్గాల నుంచి అభినందనలు వెల్లువేతున్నాయి. ఆయనకు వివిధ పార్టీల, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, బంధువులు, మిత్రులు, వారి కుటుంబ సభ్యలు పెద్ద ఎత్తున వచ్చి డాక్టర్ బంటు కృష్ణ దంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళ్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం అయన స్నేహితులు పలువురు బుధవారం కృష్ణను సూర్యాపేటలోని ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించారు. తక్కెళ్ళపహాడ్ గ్రామానికి చెందిన క్లాస్మేట్స్ గుండు శివాజీ శోభారాణి, మిర్యాలగూడకు చెందిన సత్యవతి, శ్రీనివాసచారి పూల బొకేలు అందించి, శాలువా కప్పి సన్మానించి, స్వీట్లు పంచారు. అనంతరం మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని బంటు అనసూయ, గుండు శోభారాణి, సత్యవతి లను వారి భర్తలు శాలువాలుగప్పి సన్మానించారు. తదుపరి సత్యవతి జన్మదినోత్సవం ఈరోజే కావడంతో స్వీట్లు పంచుకున్నారు. మొత్తానికి ముగ్గురు క్లాస్మేట్లు తమ జీవిత భాగస్వాములతో కలిసి బుధవారం సూర్యాపేటలో ఆహ్లాదకరమైన వాతావరణంలో, సంతోషంగా, ఆనందంగా గడిపి వేడుకలను ఘనంగా నిర్వహించారు.