సోమప్ప సోమేశ్వర ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు
సూర్యాపేట, రచ్చబండ: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం సోమవరం గ్రామపంచాయతీ పరిధిలోని చారిత్రాత్మక సోమప్ప దేవాలయ ఆవరణలో గురువారం
హుండీ ఆదాయం లెక్కించారు. దేవాలయంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రూ.1,61,080 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ చైర్మన్ చిత్తనూరు సత్యనారాయణ తెలిపారు. హుండీ ద్వారా రూ 103,913 లక్షలు హుండీ ఆదాయం, దర్శనం టిక్కెట్లు, అభిషేకాల ద్వారా రూ 57,155 వేలు సమకూరినట్లు తెలిపారు, హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నల్గొండ నిఖిల్, మేనేజర్ మృత్యుంజయ శాస్త్రి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసమూర్తి, వైస్ చైర్మన్ లొడంగి లక్ష్మయ్య, పగిడిమర్రి సోమయ్య, పెండెం సైదులు, మాలోతు బాలామణి, సోమవారం గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్, మాజీ చైర్మన్ కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అజయ్, గోవర్ధన్, యూత్ అధ్యక్షుడు రవి, బుజ్జయ్య, ఎస్.కె రహీం, ఎస్ కే సొందుమియా, పాల్వాయి గోపాలకృష్ణ, పెదపంగా విజయ్, మామిడి శ్రీను, కారిగుల వెంకటేశ్వర్లు, డి. విజయ్ మనయ్య, ప్రకాశం, సత్తార్, వెంకన్న, దండ సంజీవరెడ్డి, నహీం మొద్దీన్, సైదులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, కాటయ్య, నాగయ్య, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.