మంచికి మారుపేరు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్

* తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో కీలకం
* బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు
* ఘనంగా మారిపెద్ది జన్మదిన వేడుకలు

సూర్యాపేట, రచ్చబండ: మంచికి మారుపేరు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ అని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో ఆయన ఎంతో క్రియాశీలకంగా పని చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు అన్నారు. బీఆర్ఎస్ యువజన విభాగం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో బాణంసంచా కాల్చి కేక్ కట్ చేసి, శాలువాతో సన్మానించి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బైరు వెంకన్నగౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండీ ఆయూబ్ ఖాన్, సూర్యాపేట మండల రైతు సమన్వయ సమితి మాజీ కోఆర్డినేటర్ కక్కిరేణి నాగయ్య, పీఏసిఎస్ వైస్ చైర్మన్ బొల్లే జానయ్య, పల్స వెంకన్న, రావి చెట్టు సత్యం, బైరు వెంకన్న ముదిరాజ్, రషీద్, పల్లె లక్ష్మణ్, అన్నపూర్ణ నరేందర్, బాల్మీకి సంజయ్, కిరిటి, రాజీవ్, అక్బర్, పాల్వాయి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు