జర్నలిస్టులకు హైదరాబాద్ లో శిక్షణ తరగతులు

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఈనెల 18, 19 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టులకు, ఈనెల 25, 26 తేదీల్లో ఉర్దూ జర్నలిస్టుల కోసం శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేసే జర్నలిస్టులకు వృత్తి, మెరుగుదలపై శిక్షణ తరగతులు ఉంటాయని అల్లం నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆరు క్లాసులు ఉంటాయని చెప్పారు. వార్తలు, నేర వార్తలు తప్పొప్పులు, ఎడిటింగ్, సోషల్ మీడియా తదితర అంశాలపై తరగతులు ఉంటాయని వివరించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ జర్నలిస్టులతో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులతో ఇంటరాక్షన్ ఉంటుందని అల్లం నారాయణ తెలిపారు.

ఉర్దూ జర్నలిజం ఏర్పడి 200 ఏళ్లు అయిన సందర్భంగా ఉర్దూ జర్నలిస్టుల కోసం ఈనెల 25, 26 తేదీల్లో శిక్షణ తరగతులు ఉంటాయని అల్లం నారాయణ తెలిపారు.

ఈ సమావేశంలో అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వరరావు, జర్నలిస్టు సంఘాల నేతలు సాగర్, మాజిద్, అంజద్ తదితరులు పాల్గొన్నారు.