Tollywood hero Sharwanand injured.. టాలీవుడ్ హీరో శర్వానంద్ కు గాయాలు

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి: టాలీవుడ్ హీరో శర్వానంద్ గాయాలపాలయ్యారు. హైదరాబాద్ లో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆదివారం తెల్లవారుజామున ఫిలింనగర్ జంక్షన్ వద్ద ఎదురుగా బైక్ రావడంతో దానిని తప్పించబోగా శర్వానంద్ నడుపుతున్న రేంజ్ రోవర్ కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పగాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి ఆయన కుటుంబ సభ్యులు కారును తీసుకెళ్లారు.

ఈ ప్రమాదంలోపై శర్వానంద్ టీం స్పందించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, ఆందోళన చెందాల్సిన పనిలేదని తేల్చి చెప్పారు. అయితే శర్వానంద్ కు ఆయన ప్రేయసి రక్షితారెడ్డితో ఎంగేజ్ మెంట్ అయింది. వచ్చే నెల మొదటివారంలో రాజస్థాన్ లో ఆయన పెళ్లి జరుగనున్నది. ఈ సమయంలో ప్రమాదం జరగడంపై ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు బాధపడుతున్నారు.