అయ్యప్ప ఆలయానికి విలేకరి రాజశేఖర్ భూరి విరాళం

* రెండు కేజీల 11 తులాల వెండిని విరాళంగా అందజేత

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప దేవాలయానికి దివంగత మాడిశెట్టి వెంకటేశం జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మాడిశెట్టి రాజశేఖర్ (సూర్య రిపోర్టర్) 2 కిలోల 11 తులాల వెండిని ఆలయ కమిటీ సభ్యులైన దండు మోహన్, మిరియాల శ్రీనివాస్ తదితరులకు ఆదివారం విరాళంగా అందించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ దేశంలోనే ఇలాంటి అయ్యప్ప దేవస్థానాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు.

కేరళలోని శబరిమలై దేవాలయం తరహాలో శంకర్ పల్లిలో అయ్యప్ప దేవాలయం స్థానిక భక్తులు నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మాజీ ఉపసర్పంచ్ సాత ప్రవీణ్ కుమార్, జూలకంటి పాండురంగారెడ్డి, అడ్వకేట్ విశ్వేశ్వర్, మణి గార్డెన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.