జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
– ఆమనగల్లు ప్రెస్ కమిటీ
నిఘా, ఆమనగల్లు:
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు మండల వర్కింగ్ జర్నలిస్టు కమిటీ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి సొంత ఇంటి కలలను నిజం చేయడానికి కృషి చేయాలని కల్వకుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే గుర్కా జయపాల్ యాదవ్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, ఆమనగల్లు ప్రెస్ కమిటీ సభ్యులు అజీమ్, రవి, నరేష్, ఇమ్రాన్, బిఆర్ఎస్ యువ నాయకులు నాగిల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.