తిరుమల వెళ్తున్నారా? వీటిని తీసుకెళ్లొద్దు! నేటి నుంచే అమలు..

తిరుమల తిరుపతి దేవస్థానం మరో నిర్ణయం తీసుకుంది. హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఈరోజు అంటే జూన్ 1 నంచే ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తుంది. ఇప్పటికే ప్రకటన ద్వారా శ్రీవారి భక్తులకు టీటీడీ తెలిపింది.

జూన్ 1 నుంచి తిరుమల కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమల కొండపైన ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంపై భక్తులు, దుకాణదారులు సహకరించాలని కోరింది.

ప్లాస్టిక్ నిషేధ అమలుపై నిఘాను ఉంచనున్నారు. అలిపిరి గేటు వద్దే ప్లాస్టిక్ వస్తువులను గుర్తించేలా స్పెన్సర్లు ఏర్పాటు చేశారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నారు. కొండపైన ఎవరైనా ప్లాస్టిక్ వాడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని, దుకాణాలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.