నల్లగొండ జిల్లాలో ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

నల్లగొండ జిల్లా అనుముల మండలం చింతగూడెం స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. ఇదే మండలం అనుముల, మొసంగి, చింతపల్లి గ్రామాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బొడ్డుపల్లి మహేష్, శ్రీకాంత్, శివలు నల్లగొండలోని ఓ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. ముగ్గురూ కలిసి ఓకే బైక్ పై వెళ్తుండగా చింతగూడెం స్టేజీ వద్ద రోడ్డుపై ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొంది. తీవ్రగాయాలపాలైన ఆయువకులు ముగ్గురూ ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు.