విద్యుదుత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 7వ దశ కర్మాగారం (కేటీపీఎస్) దేశంలోనే తొలిస్థానం సాధించింది. దేశంలో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు 20 వరకు ఉన్నాయి. ఇలాంటి 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) నమోదు చేసుకుంది. ఈ 20 ప్లాంట్లలో 2020 21 ఆర్థిక సంవత్సరానికి కేటీపీఎస్ 7వ దశ విద్యుదుత్పత్తిలో 87.18 శాతం పీఎల్ఎఫ్ సాధించినట్లు కేంద్రం అధికారులు వెల్లడించారు.