- నియామకపత్రం అందించిన జిల్లా అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి
రచ్చబండ, శంకర్ పల్లి: భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా శంకర్ పల్లి మండలం గోపులారం గ్రామానికి చెందిన చేవెళ్ల బిజెపి నాయకులు తొండ రవిని రంగారెడ్డి జిల్లా బిజెపి అధికార పార్టీ ప్రతినిధిగా రంగారెడ్డి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి ఎంపిక చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో తొండ రవికి నియామక పత్రాన్ని అధ్యక్షులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ అభివృద్ధికి నిష్టగా పనిచేయాలని కోరారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా బిజెపి అధికార ప్రతినిధిగా ఎంపికైన తొండ రవి మాట్లాడుతూ చేవెళ్లలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు జిల్లా బిజెపి అధికార ప్రతినిధిగా ఎంపిక చేసినందుకు జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మున్సిపల్ బిజెపి అధ్యక్షులు బీర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.